జడ్చర్ల, ఆగస్టు 7: జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు ఫరీద్ ఉద్దీన్‌కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC)లో కీలక బాధ్యతలు దక్కాయి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) నిన్న (ఆగస్టు 6న) విడుదల చేసిన అధికారిక ప్రకటన మేరకు ఆయనను టీపీసీసీ సోషల్ మీడియా విభాగం కో-కోఆర్డినేటర్‌గా నియమించారు.
ఈ నియామకానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు.సోషల్ మీడియా ద్వారా పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంలో ఫరీద్ ఉద్దీన్ కీలక పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా పార్టీ సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయన నిబద్ధతను గుర్తించి అధిష్ఠానం ఈ బాధ్యతలు అప్పగించింది.ఫరీద్ ఉద్దీన్ నియామకంపై జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.
