జడ్చర్ల సిగ్నల్ గడ్డ నుండి నేతాజీ చౌరస్తా వెళ్లే నాగర్ కర్నూల్ రోడ్డుపై సాయినాథ్ బేకరీ వద్ద జరిగిన ప్రమాద నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన లారీ ఒక బైక్ పై వెళ్తున్న కుటుంబంపైకి వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ దూసుకువచ్చింది.బైక్ పై ప్రయాణిస్తున్న మహిళ ప్రమాదవశాత్తు లారీ కింద పడిపోయింది. లారీ కింద పడిన మహిళను అక్కడే ఉన్న స్థానికులు, వ్యాపారస్తులు క్షణాల్లో స్పందించి ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీశారు.
ప్రమాదానికి గల ముఖ్య కారణాలు రోడ్డుపై ఉన్న పెద్ద పెద్ద గుంతలలో వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులకు గుంతల లోతు తెలియడం లేదు బైక్ నడుపుతున్న వ్యక్తి నీటి గుంతను తప్పించబోయి అదుపుతప్పడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ ముఖ్యమైన నాగర్ కర్నూల్ రోడ్డు గుంతలమయంగా మారినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు ఎంతో మంది ప్రాణాల మీదికి తెస్తున్న ఈ రహదారి గుంతలను వెంటనే పూడ్చి, రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్నారు.
