జడ్చర్ల ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ 'తెలుగు శేఖర్' పుట్టినరోజు వేడుక- ఘనంగా సత్కరించిన జర్నలిస్టు మిత్రులు

జడ్చర్ల ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ 'తెలుగు శేఖర్' పుట్టినరోజు వేడుక- ఘనంగా సత్కరించిన జర్నలిస్టు మిత్రులు

TBN LIVE

ఏప్రిల్ 4 శనివారం జడ్చర్ల పట్టణ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు తెలుగు శేఖర్ జన్మదిన వేడుక శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. సహచర విలేకరులు, స్నేహితులు మరియు అభిమానుల సమక్షంలో శేఖర్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వి.కృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి సుల్తాన్ మాట్లాడుతూ తెలుగు శేఖర్ జర్నలిజం రంగంలో ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని కొనియాడారు. నిరంతరం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తిగా ఆయనకు మంచి పేరుందని తెలిపారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అనంతరం సహచర జర్నలిస్టులు శేఖర్‌ను పుష్పగుచ్ఛాలతో అభినందించి, శాలువాతో సత్కరించారు. శేఖర్ యొక్క స్నేహపూర్వక స్వభావం, కష్టపడే తత్వం అందరికీ ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు తాంబూలం శ్రీనివాసులు, పానుగంటి సురేందర్, అబ్దుల్ సత్తార్, మోహిన్, యూసుఫ్, జమీర్, శేఖర్, నిస్సార్, మల్లేష్, హైమద్, పర్వతాలు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!