జడ్చర్ల లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జన్మదిన వేడుక

జడ్చర్ల లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జన్మదిన వేడుక

TBN LIVE
జడ్చర్ల, ఏప్రిల్ 05: జడ్చర్ల మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడినేని ప్రణీల్ చందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల డిజిటల్ మీడియా యూనియన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ, జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన ప్రణీల్ చందర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో డిజిటల్ మీడియా యూనియన్ నాయకులు, సభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రణీల్ చందర్ గారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకంగా సన్మానించిన మీడియా మిత్రులకు ప్రణీల్ చందర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!