దుర్భాషలాడిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి

దుర్భాషలాడిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి

TBN LIVE
ఎలక్ట్రిషన్ ఆకుల వెంకటేష్ ను దూషించిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి అన్న మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ , అధ్యక్షురాలు ఇందిరమ్మ బుధవారం జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి  తన చాంబర్లో, ఏఈ గాయత్రి  మరియు
చైర్ పర్సన్ కోనేటి పుష్పలత , కోనేటి లక్ష్మీనరసింహులు వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ ఎలక్ట్రిషన్లు తో జరిగిన లైట్ల రిపేర్ కి సంబంధించిన అంశం పై ఎలక్ట్రిషన్ లతో మాట్లాడుతున్న సందర్భంలో సీనియర్ ఎలక్ట్రిషన్ ఆకుల వెంకటేష్ కాంట్రాక్టర్ డబ్బుల విషయమును గురించి మాట్లాడుతుండగా కమిషనర్ ఆవేశంతో నీవు ఏం చేయడానికి ఉన్నావు అంటూ అసభ్య  పదజాలలు తో దూషిస్తూ నిన్ను సస్పెండ్ చేస్తున్నాము అని అన్నందుకు నిరసనగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అయిన ఎలక్ట్రిషన్ ఆకుల వెంకటేష్ కు మద్దతుగా బాదేపల్లి మున్సిపల్ కార్యాలయం బుధవారం మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4:00 వరకు నిరసన తెలుపుతూ కమీషనర్ వైఖరి కి నిరసనగా  శానిటేషన్  విభాగము కార్మికులను ఎలక్ట్రిషన్,వాటర్ సప్లై  విభాగం పాల్గొన్నారు. ఇట్టి విషయం పై అధికారులు స్పందించి దుర్భాషలు అసభ్య పదజాలు ఉపయోగించిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ అంశంపై మా యొక్క రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం యూనియన్ నాయకులతో చర్చించి తదుపరి  కార్యచరణ ఉంటుందని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు తరపున హెచ్చరించారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!