అభివృద్ధికి నోచుకోని బోయలకుంట గ్రామం
October 29, 2025
బోయలకుంట వాసి సయ్యద్ ఇమ్రాన్ మాట్లాడుతూ జడ్చర్లలో తేలుకపాటు వర్షానికి సైతం బోయలకుంట వాసులకు గుండెల్లో గుబులు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది .గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏమైనా జరిగితే మాత్రం అంబులెన్స్ కూడా రాని పరిస్థితి నెలకొంది పట్టణంలో చదువుకునే విద్యార్థులు సైతం కూలి పని చేసుకునే పెద్దల వరకు వానాకాలం వస్తే చాలు భయం గుప్పెట్లో పెట్టుకుని రోడ్డు పై నుంచి వెళ్లాల్సి వస్తుంది. పేరుకు జడ్చర్ల పట్టణం నుండి సుమారు నాలుగు కిలోమీటర్లు కూడా లేని మా గ్రామం అభివృద్ధి కి నోచుకోని పరిస్థితి గతంలో మా గ్రామ లోని ఒక యువకుడు జడ్చర్ల నుండి మాగ్రామానికి వస్తున్న తరుణంలో నల్లకుంట నుండి వచ్చే వరదలో చిక్కుకొని గల్లంతయ్యారు ఆ విషయం తెలుసుకున్న వెంటనే అన్ని పార్టీల నాయకులు వచ్చి చూచిపోయారే తప్ప ఇప్పటివరకు ఈ సమస్య పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ ఆవేదం వ్యక్తం చేశారు దయచేసి ఇప్పటికైనా మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని బోయిలకుంట ప్రజలు కోరారు లేదంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో ఏ నాయకులు కూడా మా గ్రామానికి ఓట్లు అడిగేందుకు రావద్దని అభివృద్ధి చేయకుంటే మాత్రం వాళ్లకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా బోయలకుంట గ్రామ వాసులు అనుకుంటున్నారు.
Tags
