రోడ్డు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో విద్యార్థుల బస్సుకు పెనుప్రమాదం

రోడ్డు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో విద్యార్థుల బస్సుకు పెనుప్రమాదం

TBN LIVE
జడ్చర్ల, మండలంలో ని లింగంపేట రోడ్డు మార్గ మధ్యలో 30 మంది విద్యార్థుల తో వెళ్తున్న నజినికేతన్ ఆశ్రమ పాఠశాల బస్సు వెళుతున్న క్రమంలో రోడ్డు పక్కకు ఒరిగిపోవడం విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్, అటుగా వెళ్తున్న వ్యక్తులను పిలవడంతో వారు విద్యార్థులను సురక్షితంగా బస్సులో నుంచి కిందకి దించారు. ఈ ఘటన లో కొంతమంది విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటన కోడుగల్-లింగంపేట మార్గ మధ్య లో జరిగింది.
అయితే ఘటన నిర్వహణకు టెండర్ తీసుకున్న రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ గంగాపూర్ నుండి కోడుగల్ వరకు రోడ్డు కాంట్రాక్టర్ ఈ గ్రామాల మధ్య రాకపోకలకు మరో రహదారి నిర్మించక పోగా ఉన్న రోడ్డుకు మట్టి అడ్డంగా వేయడంతో పాటు గోతులున్నా కూడా పట్టించుకోకుండా నెలల తరబడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే తరచుగా ఈ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయి పలువురు గాయపడుతున్నారని ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం కూడా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల బస్సు రోడ్డు పక్కలోని గోతిలోకి ఒరిగిపోయి పెను ప్రమాదం తప్పిందని రోడ్డు కాంట్రాక్టర్ మొదటగా ప్రజల రవాణా సౌకర్యం రాకపోకలకు తాత్కాలికంగా రోడ్డు గుంతలు మెట్టెలు లేకుండా సరిచేసి డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని లేకపోతే ఆ రోడ్ లో ఉన్న ఆయా గ్రామస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థులు తల్లిదండ్రులు హెచ్చరించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పై అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!