స్వచ్ఛందంగా శ్రమదానం చేసిన నెక్కొండ అమ్మపల్లి ప్రజలు

స్వచ్ఛందంగా శ్రమదానం చేసిన నెక్కొండ అమ్మపల్లి ప్రజలు

TBN LIVE
నెక్కొండ గ్రామం నుండి గంగాపూర్ కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఏపుగా గాఢంగా పెరగడం తో వాహనాలకు రాకపోకలకు టర్నింగ్ లో వచ్చే వాహనాలు కూడా కనిపియనంత తీవ్ర ఇబ్బందులకు గురైన వాహనదారులకు ఈ రోజు విముక్తి కలిగినది అందుకు కారణం గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి నసురుద్దీన్ ఈ విషయం పై చొరవ తీసుకొని గ్రామ సంబంధిత గ్రూపులో పెట్టడంతో కొంతమంది పెద్దలు యువకులు, స్వచ్ఛందంగా సేవ చేయడం కొరకు ముందుకు రావడం జరిగింది. రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించి డోజర్ సహాయంతో శ్రమదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ సర్పంచ్ కోడిగంటి శ్యామలమ్మ ఆంజనేయులు, కాటమొని కృష్ణయ్య ,కాటమోని శ్రీనివాసులు, కురువ నరసింహ ,కొమురయ్య ,లవ కుమార్, దుబ్బ వెంకటేష్ , రామ్ రెడ్డి, కే వెంకటేష్ ,ఆకుల సత్తయ్య ,మధు, కటికే లింగం ,శంకరయ్య ,విజయ్ ,మురళి మరియు గ్రామపంచాయతీ సిబ్బంది శంకర మౌని కుమార్ ,సాయిలు, మల్లేష్ ,బాలమ్మ తో పాటు గ్రామంలో ని తదితర పెద్దలు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
   
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!