జడ్చర్ల డా. బూర్గుల కళాశాలలో సుందర్‌లాల్ బహుగుణ వర్ధంతి వేడుకలు

జడ్చర్ల డా. బూర్గుల కళాశాలలో సుందర్‌లాల్ బహుగుణ వర్ధంతి వేడుకలు

TBN LIVE
జడ్చర్ల, మే 21: స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చిప్కో ఉద్యమనేత, పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణ అయిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ బి. సదాశివయ్య బహుగుణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "చెట్లను హత్తుకోండి (చిప్కో) అనే నినాదంతో వేలాది వృక్షాలను కాపాడిన గొప్ప పర్యావరణ ప్రేమికుడు బహుగుణ అని కొనియాడారు. ఆయన జీవితం, పర్యావరణ రక్షణకు ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇలాంటి మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సమాజంలో పర్యావరణం పట్ల అవగాహన పెంచవచ్చని సదాశివయ్య తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల బొటానికల్ గార్డెన్‌లో ఆయన జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటి 'హరిత నివాళి' అర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధనేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ (NSS) యూనిట్-3 వాలంటీర్లు, మరియు పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!