అనాథ పిల్లలకు ఉచితంగా దుస్తులు కుట్టిన టైలర్ ఉదయ్

అనాథ పిల్లలకు ఉచితంగా దుస్తులు కుట్టిన టైలర్ ఉదయ్

TBN LIVE

జడ్చర్ల ; ఏప్రిల్ 12 సమాజ సేవలో భాగంగా జడ్చర్ల పట్టణానికి చెందిన టైలర్ జల్లి ఉదయ్ కుమార్ తన వృత్తి ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు. గత రెండేళ్లుగా ఉచితంగా దుస్తులు కుట్టిస్తున్న ఆయన సేవలను గుర్తించి, నరసింహ అనే ఆర్ట్ టీచర్ అందించిన వస్త్రాలను ఉపయోగించి 200 జతల దుస్తులను సిద్ధం చేశారు. వీటిని ఆదివారం బాదేపల్లిలోని అనూరాగిని అనాథ ఆశ్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్, జ్ఞాన వికాస భారతి ఫౌండర్ బ్రహ్మచారి చేతుల మీదుగా 25 మంది పిల్లలకు అందజేశారు. కష్టాల్లో ఉండి కూడా అనాథల కోసం ఉచితంగా శ్రమించడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు మోహన్, దత్తు, లయన్ అశ్విని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!