రాజాపూర్ కేజీబీవీలో నూతన లైబ్రరీ ఏర్పాటు ఎమ్మెల్యే తనయుడి సేవాభావం

రాజాపూర్ కేజీబీవీలో నూతన లైబ్రరీ ఏర్పాటు ఎమ్మెల్యే తనయుడి సేవాభావం

TBN LIVE

జడ్చర్ల, ఏప్రిల్ 12: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తనయుడు హితేష్ రెడ్డి తన మిత్ర బృందంతో కలిసి రాజాపూర్ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో నూతన లైబ్రరీని ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం పాఠశాలను సందర్శించిన హితేష్ రెడ్డి బృందాన్ని స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమని, అందుకే నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ, నవోదయ వంటి సంస్థలను మంజూరు చేయించినట్లు తెలిపారు. తన కుమారుడికి గ్రామీణ పరిస్థితులపై అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేశానని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!