రాష్ట్ర స్థాయి ర్యాంకర్ మౌనికకు ఎమ్మెల్యే ఘన సన్మానం

రాష్ట్ర స్థాయి ర్యాంకర్ మౌనికకు ఎమ్మెల్యే ఘన సన్మానం

TBN LIVE
ప్రభుత్వ విద్యాసంస్థల నుంచే గొప్ప విజయాలు సాధ్యం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
రాష్ట్ర స్థాయి ర్యాంకర్ మౌనికకు ఘన సన్మానం
కష్టపడి చదివితే ప్రభుత్వ విద్యాసంస్థల నుంచే అద్భుతమైన విజయాలు సాధించవచ్చని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించి సత్తా చాటిన మిడ్జిల్ మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని మౌనికను ఎమ్మెల్యే మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మౌనిక, 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆమెను శాలువాతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూపేద కుటుంబం నుంచి వచ్చి, ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుతూ మౌనిక రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడం గర్వకారణం. నేటి విద్యార్థులకు ఆమె ఒక స్ఫూర్తి. ప్రభుత్వ విద్యార్థులు తలచుకుంటే కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించగలరని మౌనిక నిరూపించింది. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!