ఓపెన్ వర్సిటీ ఉద్యోగ అవకాశాల గోడపత్రికల ఆవిష్కరణ

ఓపెన్ వర్సిటీ ఉద్యోగ అవకాశాల గోడపత్రికల ఆవిష్కరణ

TBN LIVE
తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ని ఏప్రిల్ 04: స్థానిక డాక్టర్ బి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశపెట్టిన వివిధ ఉద్యోగ, నైపుణ్య శిక్షణ పథకాల గోడపత్రికలను ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సుకన్య, కోఆర్డినేటర్ డాక్టర్ బి. సదాశివయ్య శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం టిసిఎస్ అయాన్ (TCS iON) బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే 'వి-హబ్', స్వామి రామానంద తీర్థ సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాలను వర్సిటీ అందిస్తోందని తెలిపారు.చదువుకుంటూనే సంపాదించేలా స్టైఫండ్‌తో కూడిన అప్రెంటిషిప్, నిపుణ ఫెలోషిప్, అలాగే ఆదివాసీలు, దివ్యాంగుల కోసం 'సమత ప్రీషిప్' వంటి పథకాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!