ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండగా నిలుస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 179 మంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పల్కినారు. అనారోగ్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
