తెలంగాణ లో ఇవాల్టి నుంచి చికెన్ షాపుల బంద్ కొనసాగనుంది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. తాజా చికెన్ దొరక్కపోతే నిల్వ ఉంచిన మాంసాన్ని వాడే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మాంసంపై బాక్టీరియా చేరుతుంది. ఇలాంటి మాంసం తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్వెజ్ ప్రియులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
