ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో పోలేపల్లి బిడ్డ మెరుపు – కటిక రాజశేఖర్‌కు వెండి పతకం

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో పోలేపల్లి బిడ్డ మెరుపు – కటిక రాజశేఖర్‌కు వెండి పతకం

TBN LIVE
జాతీయ స్థాయిలో జరిగిన 69వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కటిక రాజశేఖర్ అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకం (సిల్వర్ మెడల్) సాధించారు. అత్యంత కఠినమైన పోటీలతో కూడిన ఈ ఈవెంట్‌లో రాజశేఖర్ రెండో స్థానంలో నిలిచి తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు.తన చిన్ననాటి నుండి క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ఎదిగిన రాజశేఖర్.. ఈరోజు జాతీయ స్థాయిలో పతకం సాధించడంపై సొంత ఊరు పోలేపల్లిలో సంబరాలు మిన్నంటాయి. రాజశేఖర్ సాధించిన ఈ విజయంతో పోలేపల్లి గ్రామానికి, జడ్చర్ల మండలానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప గౌరవం దక్కిందని గ్రామస్థులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రాజశేఖర్ పట్టుదలకు, అంకితభావానికి ఈ మెడల్ ఒక నిదర్శనమని ఆయన చిన్ననాటి స్నేహితులు కొనియాడారు. "మా స్నేహితుడు జాతీయ స్థాయిలో రాణించడం మాకందరికీ గర్వకారణం. భవిష్యత్తులో రాజశేఖర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, పోలీస్ శాఖలో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నాం" అని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాజశేఖర్‌కు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!