గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా HPV వ్యాక్సినేషన్.. 14 ఏళ్ల బాలికలు అర్హులు

గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా HPV వ్యాక్సినేషన్.. 14 ఏళ్ల బాలికలు అర్హులు

TBN LIVE
బాలికల భవిష్యత్తును సురక్షితం చేసేందుకు, ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్ నివారణకు గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం అందుబాటులోకి వచ్చిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రతాప్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని పని దినాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వ్యాక్సిన్ వేయబడుతుంది. 0.5 ml సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను ఎడమ చేతి పైభాగంలో (IM) ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. 14 ఏళ్లు నిండి, 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలు మాత్రమే ఈ వ్యాక్సిన్‌కు అర్హులు.అంటే.. 14వ పుట్టినరోజు పూర్తయి, 15వ పుట్టినరోజు ఇంకా రాకూడదు. వారే అరుషులని తెలిపారు. అలాగే డాక్టర్ సూచనల మేరకు బాలికలు ఖాళీ కడుపుతో రావద్దు, ఆహారం తీసుకున్న తర్వాతే టీకా వేయించుకోవాలి.తప్పనిసరిగా తల్లి లేదా తండ్రి బాలికతో పాటు రావాలి.ఆధార్ కార్డు (గుర్తింపు కోసం) మరియు తల్లిదండ్రుల మొబైల్ నంబర్ వెంట తీసుకురావాలి. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా UWIN ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయబడుతుంది. తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా డిజిటల్ అనుమతి (Consent) తీసుకున్న తర్వాతే టీకా వేస్తారు. టీకా వేసిన అనంతరం 30 నిమిషాల పాటు వైద్యుల పర్యవేక్షణలో (Observation) ఉండాల్సి ఉంటుంది.గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని, తమ పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం అర్హులైన బాలికలందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రతాప్ చౌహాన్ కోరారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!