జడ్చర్ల కావేరమ్మ పేట లో హనుమాన్ జయంతి సందడి కాషాయ మయమైన విధులు

జడ్చర్ల కావేరమ్మ పేట లో హనుమాన్ జయంతి సందడి కాషాయ మయమైన విధులు

TBN LIVE
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేటలో హనుమాన్ జయంతి వేడుకలకు ముందస్తుగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ భక్తులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి కావేరమ్మ పేట వీధులన్నింటినీ కాషాయ తోరణాలతో, జెండాలతో సుందరంగా అలంకరించారు.
ప్రాంతమంతా కాషాయమయం కావడంతో భక్తిభావం ఉట్టిపడుతోంది. మారుతీ నందనుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో కావేరమ్మ పేట మారుమోగుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!