క్యాంప్ కి 431 మంది వచ్చి ఉచిత సేవలు పొందడం జరిగింది.137మంది జనరల్ ఫిజిసియన్ సేవలు, 52 మంది గైనకాలజిస్ట్ సేవలు, 36 మంది పెడియాట్రిక్ సేవలు,51 దంత వైద్య సేవలు,88 ఆర్థోపెడిక్ సేవలు,67 కంటి వైద్య సేవలు పొందడం జరిగింది.11 మందికి ఎక్స్ రే లు, 371 ల్యాబ్ టెస్టులు చెయ్యడం జరిగింది.64 మందిని మెరుగైన చికిత్స కోసం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మహబూబ్నగర్ కు రిఫర్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పుష్పలత గారు ప్రారంభించడం జరిగింది. వైస్ ఛైర్మన్ సారిక గారు ,కౌన్సిలర్స్ జ్యోతి,కుమ్మరి రాజు,బుక్క మహేష్,శశి కిరణ్ రావడం జరిగింది.జిల్లా వైద్యాధికారి డా.కృష్ణ ,జిల్లా క్షయ నిర్మూలన అధికారి డా.మల్లికార్జున్,జిల్లా MHN ప్రోగ్రాం అధికారి డా.శివకాంత్ పర్యవేక్షించడం జరిగింది.
కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొనడం జరిగింది.
