ఇప్పపువ్వు సారా పై అసెంబ్లీలో చర్చిస్తాం

ఇప్పపువ్వు సారా పై అసెంబ్లీలో చర్చిస్తాం

TBN LIVE
- అనిరుధ్ రెడ్డి వాఖ్యలపై లోతుగా అధ్యయనం చేస్తాం
- ⁠ అనిరుధ్ ఇచ్చిన రీసెర్చ్ పేపర్ పై నిపుణులతో విశ్లేషణ చేయిస్తాం
- ⁠ ఇప్ప పువ్వు సారా పై ఇప్పుడు సమగ్రంగా మాట్లాడలేo
- ⁠ మంత్రి జూపల్లి కృష్ణారావు 
జడ్చర్ల, మార్చి 13: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా పై చేసిన వాఖ్యలు, అభిప్రాయాల పై లోతుగా అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ విషయం గా అసెంబ్లీ లో కూడా సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు.
ఇప్ప పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇప్ప పువ్వు తో చేసే సారా తాగి గతంలో మన పూర్వీకులు వందేళ్లు బతికారని, బ్రిటిష్ పాలకులు వారి స్వార్థం తో నిషేధించిన ఇప్ప పువ్వు సారా ను మళ్లీ తీసుకురావాలని, దీనివల్ల అటు ప్రభుత్వానికి ఇటు గిరిజనులకు కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన వాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జడ్చర్ల లో నూతన పురపాలక సంఘం భవన ప్రారంభానికి విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ను మీడియా ప్రతినిధులు అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా పై చేసిన వాఖ్యల గురించి ప్రశ్నించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా పై తాను చేసిన పరిశోధన కు సంబంధించిన పత్రాన్ని కూడా తనకు ఇచ్చారని దానిని నిపుణులకు ఇచ్చి విశ్లేషణ చేయిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్ ఈ విషయం గా వెలిబుచ్చిన అభిప్రాయాల పై లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సాంప్రదాయ మద్యం తయారీ పై ప్రపంచం లో ఏం జరుతోందో  చెప్పారని, ఇప్ప పువ్వు సారా అధికారింగా విక్రయిస్తున్న రాష్ట్రాలు, ఇప్ప పువ్వు సారా ను కంట్రీ లిక్కర్ గా కాకుండా ఇండియన్ మేడ్  లిక్కర్ గా అనుమతించిన గోవా రాష్ట్రం గురించి కూడా తెలిపారని మంత్రి వివరించారు. అసెంబ్లీ లో కూడా ఇప్ప పువ్వు సారా పై సమగ్రంగా చర్చిస్తామని, అందరి అభిప్రాయాలు పరిగణ లోకి తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. అయితే ఈ దశ లో ఇప్ప పువ్వు సారా పై తాను ఇంత కంటే ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు
రూ.4.33 కోట్ల తో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం:
జడ్చర్ల మున్సిపాలిటీలో రూ.4.33 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ భవనాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, జడ్చర్ల పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించడానికి ఆధునిక సౌకర్యాలతో ఈ నూతన మున్సిపాలిటీ భవనాన్ని నిర్మించామని చెప్పారు. ఈ భవనం ద్వారా ప్రజలకు పరిపాలనా సేవలు మరింత వేగంగా మరియు సౌకర్యవంతంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లకు, సిబ్బందికి నూతన వస్త్రాలను మంత్రిగారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!