ఇఫ్తార్ మత సామ రస్యానికి ప్రతీక

ఇఫ్తార్ మత సామ రస్యానికి ప్రతీక

TBN LIVE
 ఇఫ్తార్ మత సామ రస్యానికి ప్రతీక జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామ రస్యానికి ప్రతీకని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణం చంద్ర గార్డెన్ లో గురువారం రాత్రి మండలాని కి చెందిన ముస్లింల కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు. ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్,  డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ నర్సింగరావు, మున్సిపాలిటీ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, సిఐలు కమలాకర్, నాగార్జున గౌడ్ ఎస్ఐలు మల్లేష్ , జయ ప్రసాద్ వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!