2026-27 వార్షిక బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుండు సున్నా
March 23, 2026
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగల సందర్భంగా 2026- 27 సంవత్సరం గాను వార్షిక బడ్జెట్ గుండు సున్నా అంటూ జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా గడచిన రెండున్నర సంవత్సరాల మా కాంగ్రెస్ పాలనలో మూడున్నర లక్షల కోట్లు అప్పు చేశాము అని మాట్లాడడం వారి పాలన ఎలా జరుగుతుందో ప్రజలు చూస్తున్నారు అని అన్నారు ఈ మూడవ బడ్జెట్ కూడా 6 గ్యారంటీలు అమలుపై ఆశాభావంతో ఉన్న ప్రజలను 420 హామీలు తో రైతులును మహిళలును మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని వారు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంకగా మారబోతుందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముందే తెలిపిన విధంగా కాంగ్రెస్ పాలన వస్తే రైతుబంధుకు రామ్ రామ్ దళిత బందుకు జై భీమ్ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ పది సంవత్సరాల వెనుకకి వెళ్లాల్సి వస్తుంది అన్నమాట నిజమైందని అన్నారు అంతేకాకుండా 2029 అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం లోకి వస్తుంది అంటున్న ముఖ్యమంత్రి కలలు కంటున్నారని మీ మోసపూరిత హామీల పాలన ప్రజలు గమనిస్తున్నారని 2029లో డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు కంకణం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
Tags
