నియామక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు
ఈ రోజు జడ్చర్ల మండలం గొల్ల పల్లి గ్రామానికి చెందిన బుర్ర పురుషోత్తం మహాబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు గా నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు ఉత్తర్వులు జారీ చేసారు.ఈ సందర్బంగా బుర్ర పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు , ప్రజా సమస్యల పరిష్కారానికై గత కొన్ని సంవత్సరాలు గా తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తుందని,మహా బూబ్ నగర్ జిల్లా లో విద్యార్థి, నిరుద్యోగ, ప్రజల సమస్యల పరిష్కారం కై భవిష్యత్తు పోరాటాలు నిర్వహించి, తెలంగాణ యువజన సంఘము బలోపేతనికి కృషి చేస్తాను అని అన్నారు.తనను జిల్లా అధ్యక్షులు గా నియమించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు గారికి ధన్యవాదములు తెలియజేసారు.
