ఫిబ్రారి 2026లో ఆడిటోరియం, ఎస్ వికేఎం'స్ ఎన్ ఎంఐఎంఎస్, ఎన్ ఎంఐఎంఎన్, జడ్చర్ల వద్ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు వ్యవస్థ (ఎఈబిఏఎన్) అమలు పై ఒక వర్క్ షాప్ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమము 10:30AM కి ఒక ప్రారంభ సమావేశముతో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమములో అంతర్దృష్టి మరియు పరిజ్ఞాన ఆధారిత ఈవెంట్ ప్రారంభాన్ని సూచిస్తూ సంప్రదాయకంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. హాజరు నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు నియంత్రణ పట్ల నిబద్ధతలను పెంచుటకు ఫార్మసీ సంస్థలను ఏఈబిఏఎస్ అమలు వైపు మళ్ళించే ఉద్దేశముతో ఈ వర్క్ షాప్ నిర్వహించబడింది.
ఈ వర్క్ షాప్ లో గౌరవనీయ శ్రీ జషుభాయ్ హిరాభాయ్ చౌదరీ, వైస్-ప్రెసిడెంట్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ), డా. ఎం. నిరంజన్ బాబు, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్, పిసిఐ మరియు డా. వి. ప్రభాకర్ రెడ్డి, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్, పిసిఐ మరియు ఏఈబిఏఎన్ నోడల్ అధికారి పాల్గొన్నారు. వీరు చర్చలకు మార్గదర్శనం చేయడం మరియు ఫార్మఈ సంస్థలలో ఏఈబిఏఎస్ అమలు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడములో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమములో ఆతిథ్య సంస్థకు ప్రాతినిథ్యం వహించిన మరియు వర్క్ షాప్ నిర్వహణ విజయవంతం కావడానికి సంస్థాగత సహకారాన్ని అందించిన డా.సుమన్ నరెడ్ల, డైరెక్టర్ మరియు డా. అశ్విని దేశ్ పాండే, డెప్యూటీ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో 30 పైగా ఫార్మసీ కళాశాలల నుండి ప్రిన్సిపల్స్, ఫాకల్టీ ఇన్ చార్జ్ మరియు యాజమాన్యము పాల్గొన్నారు. వారి ఉనికి సంస్థాగత సంసిద్ధత పై పెరుగుతున్న ప్రాధాన్యతను మరియు ఫార్మసీ సంస్థలలో పీసీఐ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటాన్ని ప్రతిబింబిస్తుంది.ఈ వర్క్ షాప్ కు శ్రీ ఆశుతోష్ గంగ్వార్, ఐటి కన్సల్టెంట్ పిసిఐ నేతృత్వం వహించారు. ఈయన ఏఈబిఏఎస్ వేదికపై, దీని ఉద్దేశాలు మరియు జాతీయ డిజిటల్ కార్యక్రమాలతో దీని సమలేఖనం పై ఒక సమగ్ర ప్రసంగాన్ని అందించారు. ఆయన వ్యవస్థ యొక్క ఆచరణాత్మక వర్క్ ప్లో, వ్యవస్థ ఆవశ్యకతలు, రిజిస్ట్రేషన్ మరియు ఆన్ బోర్డింగ్ విధానాలు, నిబద్ధత నిబంధనలు, సంస్థాగత స్థాయిలో ప్రభావవంతమైన అమలు కొరకు ఉత్తమ ఆచరణలను విశదీకరించారు. ఖచ్చితమైన మరియు వాస్తవ సమయ హాజరు రికార్డుల పర్యవేక్షణ మరియు నిర్ధారణలో అకడమిక్ నాయకత్వము యొక్క పాత్రకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది.
"బుక్ సియోడ్ మరియు రెసివ్యూస్" అనే ఒక పుస్తకము ప్రముఖుల సమక్షములో అధికారికంగా విడుదల చేయబడింది. విశ్వవిద్యాలయములో నిర్వహించబడిన పరిశోధన ప్రాజెక్ట్స్ యొక్క సమగ్ర సేకరణ ఈ పుస్తకములో ఉంటుంది. ఇది సంస్థ యొక్క ఆకడమిక్ విజయాలను మరియు ఒక శక్తివంతమైన సంస్కృతిని పెంచుటకు నిబద్ధతను చూపుతుంది.ఇంటరాక్టివ్ ప్రశ్నోత్తరాల సెషన్ తో ఈ వర్క్ షాప్ ముగిసింది. ఈ సెషన్ లో పాల్గొనేవారు సాంకేతిక సవాళ్ళు, అమలు వ్యూహాలు మరియు సంస్థాగత సంసిద్ధతలపై స్పష్టత కోసం పిస్ఐఐ ప్రతినిధులతో కలిసి చర్చించారు. నిర్మాణాత్మక సంభాషణను ఈ సెషన్ ప్రోత్సహించింది మరియు ఫార్మసీ సంస్థలలో ఏఈబిఎస్ యొక్క మృదువైన అమలును అనుకూలపరచుటకు ఆచరణాత్మక అంతర్దృష్టులను అందించింది.మొత్తమ్మీద, ఈ వర్క్ షాప్ అకడమిక్ ఉత్కృష్టత మరియు పరిశోధన వ్యాప్తి పట్ల విశ్వవిద్యాలయము యొక్క అంకితభావాన్ని ప్రాధాన్యికరిస్తూ ఏఈబిఏఎస్ ను ప్రభావవంతంగా అమలు చేయుటకు ప్రిన్సిపల్స్ మరియు ఫాకల్టీ సభ్యులకు అవసరమైన అవగాహనను అందిస్తూ సమాచారాన్ని అందించేది మరియు ప్రభావం చూపేదిగా నిరూపితం అయింది.
