ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిడ్జిల్ మండలంలోని రాణిపేటకు చెందిన బోయ శివ(26), రజిని బావబామ్మర్దులు. శివ ఇటీవల శివ దీక్ష చేపట్టి, సోమవారం విరమిం చాడు. మంగళవారం సాయంత్రం రజినితో కలిసి బైక్ పై జడ్చర్ల వెళ్తున్నాడు. జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులోని ఆశ్రమం వద్ద రోడ్డుపై ఆగివున్న లారీని వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. రజినికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చే స్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
