చెల్లెలిని కంటికి రెప్పలా కాపాల్సిన ఓ అన్న ఆమెపై లైంగికదాడికి పాల్పడి సభ్య సమాజం తలదించుకునేలా చేశా డు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌ రారం మండలంలో చోటుచేసుకున్నది. బాధితురాలి తల్లిదండ్రులు తెలి పిన వివరాల ప్రకారం.. ఈ నెల 20న ఓ 17ఏళ్ల బాలుడు ఎవరూ లేని సమ యంలో తన సొంత పెద్దనాన్న ఇంటికి వెళ్లి ఆయన కూతురుకు కత్తి చూపించి భయపెట్టి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించి బుద్ధిచె ప్పించారు. బాలికకు ప్రమాదం ఉందన్న భయంతో ఆమెను ఖమ్మంలోని బంధువు ల ఇంటికి పంపించారు. కాగా, సోమవా రం బాలిక తిరిగి గ్రామానికి వచ్చింది. ఈవిషయం తెలుసుకున్న బా లుడు రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లి 'నా వెం ట రావాలి. లేదంటే మీ ఇంటిపై పెట్రోల్ పోసి చంపేస్తా' అంటూ కత్తులతో హల్చల్ చేశాడు. తీవ్ర భయాందోళనకు గురైన బాలిక కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంకింద కేసునమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ నజీరుద్దీన్ తెలిపారు.
