జడ్చర్ల నియోజకవర్గం లోని మిడ్జిల్ మండలానికి చెందిన జాంగిర్ తంగళ్ళపల్లి పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి డీటీహెచ్ట్ టీవీ రీఛార్జ్ చేసుకునేందుకు గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతకగా, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు.వారి సూచనలతో ఫోన్ హ్యాక్ అయి, అకౌంట్ నుంచి రూ.2 లక్షలు పోయాయి. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. గుర్తుతెలియని లింకులు, నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తూ హెచ్చరించారు.
