పలు గ్రామాల్లో కుక్కలు చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నాయి.శరీరమంతా మచ్చలు, దురదతో అవి విలవిల్లాడుతున్నాయి.ఈ వ్యాధి ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపిస్తుండటంతో పాటు, వ్యాధిగ్రస్త కుక్కలు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతుండటంతో మనుషులకు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.మాంసం దుకాణాల వద్ద కోడి వ్యర్థాలను తినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని, కోళ్ల పెంపకంలో వాడే యాంటీబయాటిక్స్, మందుల అవశేషాలు పేగుల్లో నిల్వ ఉండటమే దీనికి కారణమని పశువైద్యాధికారి డాక్టర్ ఎం.హరికృష్ణ తెలిపారు.గాలి ద్వారా కూడా వ్యాపించే ప్రమాదం ఉందని, అధికారులు వీధి కుక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు
