పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడి

పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడి

TBN LIVE
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాలు మహబూబ్‌నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అడ్డాకుల, బాలానగర్, జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్ మరియు నవాబ్‌పేట మండలాల్లో 17-12-2025 న ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు.మూడో విడత ఎన్నికల నేపథ్యంలో 163 BNSS (144 సెక్షన్) అమల్లో ఉన్నందున ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుంపులుగా గుమికూడరాదని సూచించారు. పోలింగ్‌కు ముందు అనగా 15-12-2025 సాయంత్రం 5:00 గంటల నుండి పోలింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం, లౌడ్‌స్పీకర్ల వినియోగం, ర్యాలీలు, బైక్ ర్యాలీలు పూర్తిగా నిషేధమని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల, ఓటర్లు వెళ్లే మార్గాల్లో ఎలాంటి ప్రచారం, అడ్డంకులు, ఉద్రేకం లేదా ప్రలోభాలను సృష్టించరాదని హెచ్చరించారు.ఓటర్లకు ఇచ్చే చీటీలపై అభ్యర్థి పేరు, గుర్తు లేదా రాజకీయ పార్టీ పేరు ఉండరాదని, కేవలం తెల్ల కాగితంపై వార్డు నెంబర్ మరియు ఓటరు క్రమ సంఖ్య మాత్రమే రాసి ఇవ్వాలని ఆదేశించారు.పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో లేదా 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎన్నికల భద్రతా దృష్ట్యా మద్యం దుకాణాలు (వైన్ షాపులు) డిసెంబర్ 15 సాయంత్రం 05:00 గంటల నుండి డిసెంబర్ 18 ఉదయం 10:00 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని, మద్యం అక్రమ రవాణా, నిల్వ లేదా వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి గుర్తింపు కార్డులు (ఓటర్ కార్డు, ఆధార్ కార్డు తదితరాలు) మాత్రమే తీసుకురావాలని, ఇంక్, వాటర్ బాటిళ్లు, కత్తులు లేదా భద్రతా సిబ్బందికి అనుమానం కలిగించే ఇతర వస్తువులు అనుమతి లేదని తెలిపారు. పోలింగ్ పూర్తయ్యే వరకు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో స్థానికేతరులు ఉండరాదని, ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే గుమిగూడకుండా తమ నివాసాలకు వెళ్లాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు లేదా ప్రదర్శనలకు అనుమతి లేదని, నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై MCC ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయబడతాయని జిల్లా ఎస్పీ డి. జానకి హెచ్చరించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, స్వచ్ఛంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!