జడ్చర్ల పట్టణం లోని హరిజన వాడ ZPHS పాఠశాల లో లయన్స్ క్లబ్ జడ్చెర్ల ఆధ్వర్యంలో హరిజన వాడ ZPHS, ఎర్రసత్యం స్కూల్ మరియు హరిజనవాడ ప్రాథమిక పాఠశాల కు చెందిన 100 కు పైగా విద్యార్థులకు మంగళవారం ఉచిత కంటి శిబిరమును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపాలిటీ చైర్మన్ కోనేటి పుష్పలత,ఉప చైర్మన్ సారిక మరియు లయన్స్ క్లబ్ జడ్చర్ల అధ్యక్షులు ధ్రువ బాదిమి, లైన్స్ క్లబ్ సెక్రటరీ కాల్వ రాంరెడ్డి స్థానిక కౌన్సిలర్ రమేష్ ,పాఠశాల HM గోవింద్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో అతిథులు మాట్లాడుతూ పిల్లల ఈ కాలం లో సెల్ ఫోన్ మరియు TV లు ఎక్కువగా చూడటం వలన కంటి చూపుకు జరిగే నష్టాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు గొప్పవి అని మరియు వారికీ కావలసిన పూర్తి సహకారం అందిస్తాము అని వ్యక్తపరిచారు. అలాగే కంటి అద్దాలు కావలసిన వారికి ఉచితంగా ఇస్తాము అని రాబోవు కాలం లో మరిన్ని సేవ కార్యక్రమాలను చేపడుతాము అని
లయన్స్ క్లబ్ అధ్యక్షులు ధ్రువ బాదిమి, సెక్రటరీ కాల్వ రామ్ రెడ్డి, కోశాధికారి కొండూరు వెంకటేష్ లు తెలిపారు.
ఇట్టి కార్యక్రమం లో లయన్స్ క్లబ్ పెద్దలు , పాఠశాల సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.
