వరుసగా మరో మారు జడ్చర్ల లో గంజాయి కలకలం
November 11, 2025
తేది అనగా 10.11.2025 న సోమవారం ఉదయం జడ్చర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బండమీదిపల్లి శివారులో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ప్రకాష్ రవిదాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుండి 305 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రవిదాస్ బండమీదిపల్లిలోని ఆర్ బిఆర్ కంపెనీలో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. జార్ఖండ్ రాష్ట్రం నుండి గంజాయినీ తీసుకొని వచ్చి 10 గ్రాములకు 500 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నాము.అని జడ్చర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి క్రయ, విక్రయాలు జరిపినట్లయితే 9030019943 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించ గలరు. ఎవరైనా గంజాయి విక్రయించినా, లేదా కొనుగోలు చేసినా చట్టపరమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ టి. కార్తీకెడ్డి, హెడ్కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సిద్ధార్థలు పాల్గొన్నారు.
Tags
