రక్తపింజర్లు పాముల తో జాగ్రత్త

రక్తపింజర్లు పాముల తో జాగ్రత్త

TBN LIVE
నవంబర్ మరియు డిసెంబర్ నెలలు రక్తపింజర పాములకు ప్రత్యుత్పత్తి కాలం కావటం మూలంగా జడ్చర్ల మరియు పరిసర ప్రాంతాల్లో ఒక్క నెలలోనే సుమారు 13 రక్తపింజర పాములను రక్షించినట్టు సర్పరక్షకుడు డా. బి. సదాశివయ్య తెలిపారు. గత నెల 27 వ తేదీ నుండి ఈ నెల 27 వ తేదీ లోపల ఒక నెల వ్యవధి లోనే 13 రక్త పింజర పాములను రక్షించామన్నారు. ఈ కాలంలో మగ రక్త పింజర్లు ఆడ రక్త పింజర కోసం అదే విధంగా ఆడ రక్త పింజర్లు మగవాటికోసం వెతుకుతూ దూర ప్రాంతాలకు తరలిపోతుంటాయన్నారు. ఈ సందర్భం లో వాటికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని భావించినా లేదా ఏదైనా అడ్డంకి ఎదురైన ఇళ్లలోకి గానీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కి గానీ వస్తుంటాయి. మరీ ముఖ్యంగా చిన్న చిన్న రాళ్ళ గుట్టలున్న ప్రాంతాలు, దేవునిగుట్ట తండా, పోలేపల్లి తండా, అదేవిదంగా రైస్ మిల్లు లు, పల్లి మిల్లు లు, ఊరి చివర ప్రాంతాల లో ఎక్కువగా దొరుకుతున్నాయన్నారు. ఈ పాములు నిశాచర జీవులని రాత్రి సమయం లో మాత్రమే ఎక్కువగా కనపడతాయన్నారు. ఈ పాములు జతకట్టిన తర్వాత సుమారు 5 నెలల తరువాత నేరుగా పిల్లల్ని కంటాయి. ఒక్కొక్క పాము 30 నుండి 40 పిల్లలని కంటాయి. అరుదుగా 75 వరకు పిల్లలని కనే అవకాశం ఉందన్నారు. వీటి విషం రక్త ప్రసరణ వ్యవస్థ మీద పని చేస్తుందని, కరిచిన భాగం బాగా కందిపోయి ఎక్కువగా వాపు వస్తుందని ఎక్కువ సమయం హాస్పిటల్ కి పోకపోతే రక్త నాళాలు చిట్లిపోయి రక్తం కారే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ ఈ పాములతోిజాగ్రత్త గాఉండాలని మీ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే 9963536233 నెంబర్ కి కాల్ చేయాలని సూచించారు. రైతులు రాత్రి వేళ పొలాల్లో సంచరించేటప్పుడు తప్పనిసరి వదులుగా ఉన్న దుస్తులు, టార్చ్ లైట్ తప్పనిసరి అని తెలిపారు. 
పాము కరిసిన తర్వాత ఇచ్చే విరుగుడు మందుకూడా వీటి విషం నుంచే తీస్తారు. కాబట్టి వీటిని సంపకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద వుందన్నారు.అవి కూడా ప్రకృతి లో భాగమే అని వాటికి కూడా జీవించే హక్కు ఉంది అని గుర్తెరగాలి అని సూచించారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!