23వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

23వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

TBN LIVE
జడ్చర్ల లో యషు చాలెంజర్స్ ఛాంపియన్షిప్ 23వ కరాటే పోటీలను ప్రారంభించిన రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరం అని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో ఆదివారం యషు చాలెంజర్స్ ఛాంపియన్షిప్ 23వ జాతీయ కరాటే పోటీలను మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు కరాటే ఎంతో అవసరం అని కరాటే తో ఆహ్లాదనికి పెంపొందిస్తుంది అని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరాటే పోటీల ఏర్పాటు చేసిన జడ్చర్ల కరాటే మాస్టర్లను అభినందించారు,  గత 15 ఏళ్ల క్రితం కరాటే మాస్టర్లందరూ తన దృష్టికి మార్షల్ ఆర్ట్స్ కరాటేలను అభివృద్ధి పరచే విధంగా కృషి చేయాలని కోరినట్లు మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు, జడ్చర్ల పట్టణ కేంద్రం లో ప్రతి మూడు ఆరు మాసాలకు ఒక్కసారి కరాటే పోటీలు నిర్వహిస్తారని పట్టణ కేంద్రం కరాటే హబ్ గా ఏర్పాటయిందని ఆయన పేర్కొన్నారు, తాను గుల్బర్గాలో చదువుతున్నపుడు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు, తాను కూడా కరాటేను బ్రౌన్ బెల్ట్ మాస్టర్ నని పేర్కొన్నారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు తల్లిదండ్రులు విద్యార్థులను కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, వార్డు కౌన్సిలర్ చైతన్య,మాజీ మార్కెట్ చైర్మన్ పిట్టల మురళి,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ధనిష్, రాంమోహన్, నరసింహ,శంకర్ నాయక్,మాజీ మూడ డైరెక్టర్ శ్రీకాంత్,కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్,కరాటే శ్రీను,  మహమూద్,బాలు, కరాటే మాస్టర్లు తాజుద్దీన్,గౌస్, ఇలియాస్, తదితరులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!