కానిస్టేబుల్ గల్లా పట్టి.. ఎస్సైపై దాడికి యత్నం

కానిస్టేబుల్ గల్లా పట్టి.. ఎస్సైపై దాడికి యత్నం

TBN LIVE
నీ జాబ్ ఎంత.. నువ్వెంత? 
కానిస్టేబుల్ గల్లా పట్టి.. ఎస్సైపై దాడికి యత్నం
• జడ్చర్ల పీఎస్ లో కాంగ్రెస్ నేత వీరంగం
యాక్సిడెంట్ కేసులో రాజీ కుదిర్చే క్రమంలో ఘర్షణ
• పీ ఎస్కు దేవరకద్ర ఎమ్మెల్యే, డీఎస్సీ
జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ నేత పోలీస్ కానిస్టేబులు గల్లా పట్టి కొట్టడంతోపాటు ఏకంగా ఎస్సెపైనే దాడికి యత్నించడం సంచలనంగా మారింది. ఈ ఘటన మహబూబ్న గర్ జిల్లా జడ్చర్ల పీఎస్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యాక్సిడెంట్ కేసును విష యంలో రాజీ కుదిర్చేం దుకు భూత్పూర్ మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్డ్డి కేసు బాధ్యులతో కలిసి జడ్చర్ల పీఎస్ వచ్చారు. ఇదే విషయంపై మాట్లాడుతున్న క్రమంలోనే గొడవ చెలరేగగా.. శ్రీనివాల్రెడ్డి కానిస్టే బుల్ భీమయ్యను గల్లా పట్టి కొట్టడంతోపాటు మరో కానిస్టేబుల్ను తోసేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఇదేంటని ఎస్సె జయప్రసాద్ ప్రశ్నించగా.. 'నీ జాబ్ ఎంత? నువ్వు ఎంత?.. ట్రాన్స్ఫర్ చేయిస్తా.. దమ్ముంటే బయటకు రారా' అంటూ రెచ్చిపోయాడు. ఎస్పె బయట కు రాగా.. కాంగ్రెస్ నాయకులు అతడిని చుట్టుముట్టి దాడికి యత్నించగా శ్రీనివాస్ రెడ్డిని ఎస్సె తీసుకెళ్లి లాకప్లో వేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రక్తత నెలకొన్నది. విషయం కాస్తా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు పీఎస్ కు చేరుకుని ఘటన పై వివరాలు తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్తోపాటు ప్రత్యక్ష సాక్షులను విచారించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని, ఇదే విషయాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డికి కూడా తెలిపామని డీఎస్పీ వెల్లడించారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!