మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వ భారీ వరం

మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వ భారీ వరం

TBN LIVE
●స్వయం సహాయక సంఘాల పునరుజ్జీవానికి ప్రజా ప్రభుత్వ కట్టుబాటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
●జడ్చర్లలో మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వ భారీ వరం – రూ. 3.73 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ
●మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత స్పష్టమైందని ఎమ్మెల్యే వ్యాఖ్య
●ఆశా వర్కర్లకు యూనిఫామ్ చీరల పంపిణీ
జడ్చర్లలో వడ్డీ రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి స్వయం సహాయక సంఘాల (SHG) అభివృద్ధి, మహిళా సాధికారత పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం ఈ పథకాలను నిర్లక్ష్యం చేసి మహిళా సంఘాలను మరుగున పడేశారని విమర్శించారు.ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగతిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటూ, వడ్డీ లేని రుణాల పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు, మహిళలకు స్వయంప్రతిపత్తిని పెంచే విధంగా వివిధ అవకాశాలను కల్పిస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు మంజూరు చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి కొత్త మార్గాలు చూపుతున్నదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జడ్చర్ల నియోజకవర్గంలోనీ 3455 స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ. 3,73,67,152  వడ్డీ లేని రుణాల చెక్కులను ఇవాళ అందజేయడం జరిగినట్లు వివరించారు. మహిళల ఆర్థిక స్థిరత్వం, కుటుంబాల అభివృద్ధి, గ్రామీణ సమగ్ర పురోగతిలో స్వయం సహాయక సంఘాల పాత్ర అపారమని గుర్తు చేసారు.అనంతరం ఆశా వర్కర్లకు యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత నర్సింహులు,AMC చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి,AMC వైస్ చైర్మన్ రాజు గౌడ్ , కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మహిళా సంఘాల అధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!