బాదేపల్లి శాఖ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

బాదేపల్లి శాఖ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

TBN LIVE
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 
తేదీ 14 నవంబర నుండి తేదీ 20 నవంబర్ వరకు నిర్వహించబడిన బాదేపల్లి శాఖ గ్రంథాలయ వారోత్సవాలు సక్రమంగా నిర్వహించబడి. ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగింది. 
వరుసగా పాఠకుల దినోత్సవం, నెహ్రు జి జయంతి, విద్యార్థులకు పాటల పోటీలు చిత్రలేఖన పోటీలు నిర్వహించబడ్డాయి అదే విధంగా కవి సమ్మేళనం ఉర్దూకవులకు తెలుగు కవులకు వేరువేరుగా నిర్వహించి వాటి నుండి విజేతలను ఎంపిక చేసినాము. 
ప్రతి నిత్యము గ్రంథాలయము ఆధారంగా పాఠకులను ఎంపిక చేసి వారికి ఈ రోజు సన్మానములు చేసినాము. 
ఇటీవల కాలంలో ఏర్పడిన గ్రంథాలయ కమిటీ సభ్యులందరినీ సభకు పరిచయం చేసినాము. 
రాబోయే కాలంలో మరిన్ని సమన్నత కార్యాలు చేయాలని నిర్ణయించబడినది. విద్యార్థులకు జ్ఞాపిక బహుమతి ప్రశంసా పత్రములను పెద్దల చేత సభాముఖంగా అందించడమైనది. విద్యార్థులకు చక్కగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్ది పోటీలలో పాల్గొన్నట్లు చేయుటలో కృషిచేసిన ఉపాధ్యాయులకు ఐదుగురికి సన్మానాలు అందించినాము 
ఈ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన శ్రీ దేశవాళీ సతీష్ గారు కౌన్సిలర్ శ్రీ రమేష్ గారు కౌన్సిలర్ పాల్గొన్నారు 
గత సభలో పాల్గొన్న శ్రీ కాట్రపల్లి లక్ష్మయ్య గారు కార్యక్రమాల దృష్ట్యా అవసరమని భావించి మైకును దానపూర్వకంగా ఇవ్వడానికి అంగీకరించినందున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 
అదేవిధంగా మరోదాత శ్రీ కాలువ రామిరెడ్డి గారు కార్యక్రమాల నిర్వహణకై సహకరించుటయే కాక 25 కుర్చీలను దాన పూర్వకంగా ఇవ్వడానికి సభాముఖంగా అంగీకరించినందున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన కమిటీ సభ్యులందరికీ గ్రంథాలయ అధికారి శ్రీమతి ఎన్ లక్ష్మి గారు ధన్యవాదాలు తెలిపినారు. పుస్తక ప్రదర్శన గ్రంథాలయ ఆవరణలో అందర్నీ ఆకట్టుకుంది.విద్యార్థులు చిత్రలేఖన పోటీలలో వేసిన బొమ్మలను ప్రదర్శన పూర్వకంగా ఉంచబడినవి ప్రేక్షకులు చాలామంది చూసి ఆనందించారు 
మునుముందు గ్రంథాలయం బహుద ఉపయోగపడాలని అందరూ ఆశించినారు వారు ఆశించిన రీతిగా తీర్చిదిద్దుతామని గ్రంథాలయ కమిటీ అంగీకరించినారు  
ఈ కార్యక్రమంలో ఎండి సలీం ఉపాధ్యక్షుల వారు అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శిలు మహేశ్వర్ గారు సభ నిర్వహణ చేశారు కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు శ్రీ రాఘవేందర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు శ్రీ బుచ్చిలింగం గారు శ్రీ బత్తుల లక్ష్మయ్య యాదవ్ గారు శ్రీ బాదేపల్లి లక్ష్మణ్ గౌడ్ గారు పాల్గొన్నారు
అతిథులుగా శ్రీ పాలాది రామ్మోహన్ గారు  మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు అంతేకాకుండా మాజీ సభ్యులు రాధాకృష్ణ గారు జీవన్ గుండప్ప గారు పాల్గొని తగిన సలహాలు అందించారు 
 ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించినటువంటి గ్రంథాలయ అధికారిని లక్ష్మీ గారికి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!