ప్రజా భద్రత - పోలీసు బాధ్యత సైబర్ క్రైమ్ అవగాహన
November 07, 2025
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డు లో ప్రజా భద్రత - పోలీసు బాధ్యత సైబర్ క్రైమ్ అవగాహన ప్రోగ్రాం జిల్లా పోలీసుల సురక్షిత కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా S P జానకి కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ కోనేటి పుష్పలత మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ జానకి మాట్లాడుతూ వ్యవసాయం చేసుకునే రైతుల నుంచి కూలీల వరకు ఏపీకే లింకుల ద్వారా డబ్బు పోగొట్టుకొని బాధపడుతున్న వారు రోజురోజుకు ఎందరో ఈ సమస్యకు గురవుతున్నారు నేరస్థుడు ఎక్కడ నుండో మీతో నమ్మకంగా ఫోన్లో మాట్లాడుతూ మీ కాయ కష్టం చేసుకున్న డబ్బుల్ని దొంగలిస్తున్నాడు మీకు తెలియకుండానే మీ ఫోన్ డేటా మీ బ్యాంక్ అకౌంట్ లలో డబ్బు డ్రా చేస్తున్నారు అందుకు మీరు ఎట్టి పరిస్థితుల్ల నైనా అలాంటి వారికి మీ విషయాలు చెప్పి మోసపోవద్దు వారు అడిగే ఓటిపి చెప్పకూడదు అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి లేదా 1930 కి చేస్తే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఫ్యూజ్ చేసి మీ డబ్బును దొంగలు డ్రా చేయకుండా చేస్తారు తరువాత డబ్బులు సురక్షితంగా మీ బ్యాంక్ దగ్గరికి వెళ్లి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సైబర్ నేరస్తుల ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ లాంటివి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.
Tags
