దుందుభి వాగు నుండి అక్రమంగా ఇసుక దంద
November 01, 2025
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కురువగడ్డ పల్లి దగ్గర గల దుందుభి వాగులో యదేచ్చగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు వ్యక్తులు ధనార్జనే ధ్యేయంగా దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం కుర్వగడ్డపల్లి జాతీయ రహదారి 167 పై గల బ్రిడ్జి కింద, పరిసర ప్రాంతాల్లో రాత్రి ఇసుక డంప్ చేసి పగలు ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. పట్టపగలే ఇసుక రవాణా జరుగుతుండడంతో అక్కడికి వెళ్ళిన విలేకరులపై దుర్భాషలాడుతు కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారు ఎస్సై కి చెప్పుకుంటారా సిఐ కి చెప్పుకుంటారా..సిఎం కి చెప్పుకుంటుంటారా, ఇక్కడికి ఎవరు వచ్చినా వస్తే విలేకరులను ట్రాక్టర్ తో తొక్కి చంపేస్తాం అంటూ బెదిరించారు. ఇసుక రవాణా చేస్తున్నా ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్ కూడా లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయంటేనే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Tags
