జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి (క్యానబిస్) విక్రయించబోయే నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకొని, వారివద్ద నుండి గంజాయి మరియు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి తేదీ 01.11.2025 ఉదయం సుమారు 09:30 గంటల సమయంలో, జడ్చర్ల పోలీస్ స్టేషన్ సన్ఇన్స్పెక్టర్ కె. మల్లేష్ సిబ్బంది HC-897 వెంకట్ రెడ్డి, PC-1233 నర్సింహులు, PC-38 నాగరాజు లతో కలిసి పోలీస్ వాహనం Innova TS-09-PA-4280 లో పహారా విధుల్లో ఉన్నారు. పహారా సమయంలో, జడ్చర్ల NH-44 హైవే ఇన్స్పెక్షన్ బంగ్లా సమీపంలో నలుగురు అనుమానాస్పద వ్యక్తులు కనిపించి, పోలీసులు వారిని చేరుకోవడానికి ప్రయత్నించగా, వారు పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించారు. పోలీసులు వెంటపడి వారిని అదుపులోకి తీసుకున్నారు.వారిని విచారించగా, వారి వద్ద నల్ల రంగు ప్లాస్టిక్ కవర్లలో గంజాయి ఉన్నట్లు బయటపడింది.అదుపులోకి తీసుకున్న నిందితులు 1. అబ్బు తాలిబ్, వయస్సు 25. సంవత్సరాలు, వృత్తి కూలీ, నివాసం ఫిరోజ్ నగర్, జడ్చర్ల. 2. గుండు హరిప్రసాద్, వయస్సు 20 సంవత్సరాలు, వృత్తి డ్రైవర్, నివాసం: సంజీవయ్య కాలనీ, బాదేపల్లి. 3.ఎం.డి. ఆజర్ అలీ, వయస్సు 35 సంవత్సరాలు, వృత్తి కూలీ, నివాసం: పాలసబ్ గుట్ట, మహబూబ్నగర్. 4.మంద కార్తీక్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి విద్యార్థి, నివాసం: నిమ్మబావిగడ్డ, బాదేపల్లి. వీరి దగ్గర నాలుగు ఫోన్ల 200 గ్రాములు గంజాయి అంచనా విలువ 10,000 నుండి 25,000/-
పట్టుబడిన గంజాయి ముఠాతో తో వివరాలు సేకరించగా
ప్రాథమిక విచారణలో నిందితుడు అబ్బు తాలిబ్ ప్రధానంగా గంజాయి కొనుగోలు చేసి, జడ్చర్ల పట్టణ పరిసర ప్రాంతాలలో యువతకు విక్రయించేవాడని, మిగతా ముగ్గురు అతనికి సహకరించేవారని తేలింది. తదుపరి విచారణలో తాలిబ్ గతంలో కూడా దొంగతనం, POCSO మరియు ఇతర నేర కేసుల్లో జైలుకు వెళ్లిన క్రిమినల్ హిస్టరీ ఉన్నట్లు రికార్డులు ధృవీకరించాయి. నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసిన గంజాయి నమూనాలను పంచుల సమక్షంలో సీజ్ చేసి, నమూనా ప్యాకెట్లు సిద్ధం చేసి జడ్చర్ల PS ముద్రతో సీల్ చేసి, పంచనామా తయారు చేశారు. తరువాత, నిందితులను NDPS చట్టం 1985 సెక్షన్ 20(b)(ii) (A) ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసిన గంజాయి నమూనాలను రసాయన పరీక్ష (FSL Hyderabad)కు పంపించగా, మిగతా వస్తువులను కేసు సాక్ష్మాలుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ మాల్టానాలో జమ చేశారు. ఈ కేసు కు సంబంధిత జడ్చర్ల పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జడ్చర్ల శ్రీ బి.CI కమలాకర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు విక్రయం పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం కోసం పోలీసులు నిరంతరం పహారా మరియు రహస్య సమాచారంపై కఠినంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము అని పోలీసులు తెలిపారు. ఈ చర్యను మహబూబ్నగర్ జిల్లా పోలీస్ అధికారి గారి ఆదేశాల మేరకు చేపట్టినట్లు తెలియజేస్తూ, జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి మత్తు పదార్థాల వ్యాపారాలపై మరింత పటిష్ట చర్మలు కొనసాగిస్తామని తెలిపారు.ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,జడ్చర్ల స్టేషన్,
