సరిహద్దు సమస్య రైతులకు ఊరట

సరిహద్దు సమస్య రైతులకు ఊరట

TBN LIVE
పత్తి కొనుగోలు కేంద్రాల్లో పరిష్కారమైన ‘సరిహద్దు’ సమస్య బాలానగర్ రైతుల కోసం అనిరుధ్ రెడ్డి చేసిన కృషి సరిహద్దు జిల్లాలను మ్యాపింగ్ చేసిన సీసీఐ అధికారులు ఎమ్మెల్యే కృషితో రాష్ట్రవ్యాప్తంగా పరిష్కారమైన సమస్య వేలాది మంది పత్తి రైతులకు లభించిన ఊరట అనిరుధ్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్న పత్తి రైతులు నియోజకవర్గానికి చెందిన పత్తి రైతులు ఆ నియోజకవర్గంలోనే తాము పండించిన పత్తిని అమ్ముకోవాలన్న సరిహద్దు సమస్యతో సతమతమౌతున్న పత్తి రైతుల సమస్య జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చొరవతో పరిష్కారమైయింది. అనిరుధ్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని రైతుల సమస్య పరిష్కారానికి చేసిన కృషి కారణంగా ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోని పత్తి రైతులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్న వేలాది మంది పత్తి రైతులకు కూడా ఊరట లభించింది.  ఈ ఉదంతం వివరాల్లోకి వెళ్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకూ ఆయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రైతులు మాత్రమే పత్తి పంటను అమ్ముకొనే అవకాశం ఉండేది. ఈ కారణంగా ఒక నియోజకవర్గం పరిధిలో ఉండే కొనుగోలు కేంద్రంలో మరో నియోజకవర్గానికి చెందిన రైతులు పత్తిని అమ్ముకొనే అవకాశం ఉండేది కాదు. జిల్లాలు, నియోజకవర్గాలు వేరైనప్పటికీ భౌగోళికంగా సమీపాన ఉన్న ప్రాంతాలైనా రైతులు అక్కడికి వెళ్లి పత్తిని అమ్ముకొనే వీలు లేకపోవడంతో దూరాభారమైనప్పటికీ పత్తి రైతులు తమ నియోజకవర్గం పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రానికే వెళ్లి విక్రయించేవారు. ఉదాహరణకు చెప్పాలంటే బాలానగర్ ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో ని షాద్ నగర్ నియోజకవర్గానికి కేవలం 5 కి.మీల దూరంలోనే ఉండగా, జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన బాలానగర్ రైతులు తెచ్చిన పత్తిని షాద్ నగర్ లో కొనుగోలు చేసేవారు కాదు. దీంతో తప్పనిసరి పరిస్తితుల్లో ఆ రైతులు దాదాపు 30 కి.మీ.ల దూరంలోని జడ్చర్ల కొనుగోలు కేంద్రానికి వెళ్లి పత్తిని విక్రయించేవారు. దీనివల్ల రవాణా ఖర్చులు పెరగడంతో పాటుగా రైతులు వ్యయప్రయాసలు పడేవారు. ఈ విషయం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన అక్టోబర్ 28న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి నేరుగా ముంబైకి వెళ్లి అక్కడి సీసీఐ కార్యాలయంలో సీసీఐ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను కలిసి ఈ సమస్యను గురించి వివరించడం, ఈ విషయంగా సానుకూలంగా స్పందించిన గుప్తా బాలానగర్ రైతులు షాద్ నగర్ లో కూడా తమ పత్తిని అమ్ముకొనేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ వారి ఆధ్వర్యంలో పొరుగున ఉన్న జిల్లాలకు సంబంధించిన మ్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసామని సీసీఐ అధికారులు శనివారం మొయిల్ ద్వారా సమాచారం పంపారు. జిల్లాల మ్యాపింగ్ తో పత్తి రైతులు తమ సొంత నియోజకవర్గాల్లోని కేంద్రాల్లోనే కాకుండా భౌగోళికంగా సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కూడా పత్తి ని అమ్ముకొనేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకూ ఉన్న సరిహద్దు సమస్య సమసిపోయింది. రైతులకు వ్యయప్రయాసలు, రవాణా ఖర్చులు కూడా తగ్గిపోనున్నాయి. కాగా తన సొంత నియోజకవర్గం జడ్చర్ల లోని రైతుల కోసం అనిరుధ్ రెడ్డి చేసిన ప్రయత్నం రాష్ట్రంలో ఇలాంటి సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్న రైతులందరి సమస్యనూ తీర్చింది. తన కృషి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్తి రైతులకు మేలు జరగడం పట్ల అనిరుధ్ రెడ్డి ఆనందం వ్యక్తం చేసారు. ఈ సమస్యనే పరిష్కరించడంలో తనకు సహకరించిన సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!