జడ్చర్ల ఏరియా ఆసుపత్రి 100 పడకల నుండి 50 పడకలకు కుదించడం అన్యాయం

జడ్చర్ల ఏరియా ఆసుపత్రి 100 పడకల నుండి 50 పడకలకు కుదించడం అన్యాయం

TBN LIVE

100 పడకలను 50 పడకలుగా కుదిస్తే సహించం
జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్
బిఆర్ఎస్ నేత డాక్టర్ కోడుగల్ యాదయ్య
అందించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి 100 పడకల ఆసుపత్రిని తీసుకొస్తే ప్రస్తుతము ఈ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా కుదించడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము 100 పడకల జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100 పడకల నుండి 50 పడకలు గా, బాలనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకల నుండి 23 పడకలుగా కుదించడం కోసం ప్రయత్నాలు జరుగుతుందని ఇది అన్యాయమని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ లో బెడ్లను తగ్గించాలని చూస్తే సహించేది లేదని ఇటువంటి కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాడు ఎంతో కష్టపడి ఉన్నత లక్ష్యంతో మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి కృషిచేసి 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తే నేడు 50 పడకల ఆసుపత్రిగా కుదించడం ఏమిటని డాక్టర్ యాదయ్య ప్రశ్నించారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా పడకలు పెంచేది పోయి, తగ్గించడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కుట్రలు సాగనీయమని కుదించాలని చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఆరోగ్యకరమైన జడ్చర్ల ను చూడడమే మాజీ మంత్రి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి లక్ష్యమని,బి ఆర్ఎస్ పార్టీ నేత డాక్టర్ కోడుగల్ యాదయ్య అన్నారు. జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అత్యాధునిక సదుపాయాలతో ఉచితంగా అందించాలనే ఉన్నత లక్ష్యంతో మాజీ మంత్రి డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి కృషితో జడ్చర్ల పట్టణంలో 100 పడకల ప్రభుత్వాసుపత్రిని అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతము జడ్చర్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిగా ఎంతో మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు చికిత్సలు అందుతున్నాయని ఆయన తెలిపారు, గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య పరంగా వెనుకబడి ఉన్న జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు ఆసుపత్రిలో మెరుగైన సేవలు వైద్యులను పెంపొందించి నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందేలా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చర్యలు తీసుకోవాలి ఈ సందర్భంగా తెలియజేశారు.
జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా ఎంతో మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలను కుదించి 50పడకలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని. అదేవిధంగా బాలనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకల నుండి 23 పడకలగా కుదిస్తున్నట్లు సమాచారం అందిందని ఇటువంటి సంఘటనలను స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించి వంద పడకల ఆసుపత్రిగా నిలిచేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బి అర్ఎస్ పార్టీ నేత డాక్టర్ కోడుగల్ యాదయ్య కోరారు.ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించాలని ప్రజలకు ఆరోగ్యపరంగా మేలు జరిగే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!