జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన తానం బాలయ్య దంపతులు వాగులో గల్లంతై మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మృతదేహాలను సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని, త్వరలోనే కిష్టారం గ్రామానికి బీటీ రోడ్డు మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
