మహబూబ్నగర్ DCC కార్యాలయంలో సంగతన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్ బలపరచడమే సంగతన్ శ్రీజన్ అభియాన్ లక్ష్యం ఎమ్మెల్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన AICC అబ్జర్వర్ కర్ణాటక MLC ఎం.నారాయణస్వామి
PCC అబ్జర్వర్ ఎమ్మెల్యే గణేష్, రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జాకీర్ ఉస్మా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరచడమే సంగతన్ శ్రీజన్ అభియాన్ ప్రధాన ఉద్దేశమని, ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలలో కాంగ్రెస్ సిద్ధాంతాలను మరింత బలోపేతం చేయడం, యువతలో నూతన ఉత్సాహాన్ని నింపడం ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు.
