ఉదండాపూర్,కరివేనా ప్రాజెక్టులను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఉదండాపూర్,కరివేనా ప్రాజెక్టులను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

TBN LIVE
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉదండాపూర్ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని 80 శాతం పూర్తయిన ఉదండాపూర్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. మంగళవారం జాగృతి జనం బాట కార్యక్రమం పాలమూరు జిల్లాలో భాగంగా జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత రైతులకు పరిహారం చెల్లింపులు అన్ని పార్టీలు విఫలమయ్యాయని మానవత దృక్పథంతో భూ నిర్వాసితుల ప్యాకేజీ తెంపు పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని పేర్కొన్నారు. ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తాము నష్టపోయిన సరే కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా రంగారెడ్డి జిల్లా రైతులు బాగుపడతారని ఆలోచించి ఉదార స్వభావంతో భూములు ఇచ్చారు. అయితే ఇక్కడి రైతులను ఆదుకోవడంలో మాత్రం అన్ని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని కవిత ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు 80% పూర్తయ్యాయని.. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే పనులు పూర్తిగా ఆగిపోయాయని తెలిపారు.ఇక్కడ పనులు ఆపేసి నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులను ప్రారంభించారని ఇక్కడ 10 శాతం డబ్బులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా భూముల సాగుకు నీరు అందేవని తెలిపారు. భూ నిర్వాసితుల చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కరించడంలో ప్రభుత్వం వెనుకాడడం సరైన పద్దతి కాదన్నారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏ సమయంలో ఇస్తారో ఆ సమయంలో ఉన్న భూముల ధరల ఆధారంగా వారికి డబ్బులు చెల్లించాలని ఈ విషయమై ప్రభుత్వం మానవత దృక్పథంతో ఆలోచించి పరిహారం చెల్లించాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు అప్పగించని వేల ఎకరాల విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి తగిన పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిసెంబర్ 9లోగా 25 లక్షల పరిహారం అందేలా చూస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కడుపులోగా హామీని నిలబెట్టుకోకపోతే అప్పుడు ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని ఆమె తెలిపారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే అమలు చేస్తామని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవాలని, తులం బంగారం, 4వేల పెన్షన్ అందించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా యూత్ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపాల్, ఉదండాపూర్ భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!