జడ్చర్ల సెల్ఫోన్ల దొంగను పట్టుకున్న పోలీసులు

జడ్చర్ల సెల్ఫోన్ల దొంగను పట్టుకున్న పోలీసులు

TBN LIVE
జడ్చర్ల రూలర్ కొత్త బస్టాండ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన అనునిత్యం సెల్ ఫోడ్ల దొంగతన ఘటన కలకలం రేపింది. గద్వాల్ నుంచి జడ్చర్లకు చేరుకున్న ఒక ప్యాసింజర్, అక్కడి నుంచి కల్వకుర్తికి వెళ్లేందుకు బస్సులో ఎక్కుతుండగా అతని సెల్ ఫోన్ అపహరణకు గురయ్యింది. దీనిపై అప్రమత్తమైన ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నరసింహులు చాకచక్యంగా స్పందించి, అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని జడ్చర్ల పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్టాండ్‌లలో ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులపై జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!