మెడిసిన్ సీట్ సాధించిన కావలి శ్రీవాణి

మెడిసిన్ సీట్ సాధించిన కావలి శ్రీవాణి

TBN LIVE
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతూ మెడిసిన్ సీట్ సాధించిన కావలి శ్రీవాణి
డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యం.జడ్.సి చదువుతున్న కావలి శ్రీవాణి ఒక వైపు కళాశాల కు రోజు వస్తూ నీట్ పరీక్షకు ప్రిపైరై మంచి ర్యాంక్ సాధించి.గద్వాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చేరింది.తన తండ్రి కావాలి నరసింహులు ఇదే కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తు తన కుమార్తెకు మంచి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సుకన్య మా కళాశాల విద్యార్థికి మెడిసిన్ సీట్ రావడం మాకు చాలా గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది సన్మానం చేసి విద్యార్థిని శ్రీవాణి నీ,తండ్రి కావలి.నర్సింహులు ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి సుకన్య, అధ్యాపకులు శ్రీనివాస్, రాఘవేంద్ర రెడ్డి, సులేమాన్, నర్మద, ప్రవీణ్,ఆంజనేయులు,రాజేశ్వరి, రూక్యబాను, పుష్పలత,తిరుపతయ్య తిమ్మప్ప మొదలగు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!