జడ్చర్ల బాధపల్లి ఎర్రగుట్ట కాలనీవాసుల తాసిల్దార్ కార్యాలయం ముందు డబల్ బెడ్ రూమ్ ల లొల్లి
February 25, 2026
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల జడ్చర్ల పట్టణం బాదేపల్లి ఎర్రగుట్ట కాలనీలో నిరుపేదలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకోవడం ఉదృతకు దారితీసింది ఇట్టి విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఉదృతకు కారకులైన వారిని అక్కడినుండి చెదరగొట్టారు ఎర్రగడ్డ కాలనీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 560 డబల్ బెడ్ ఇండ్లను నిర్మించింది మంత్రి కేటీఆర్ చేతుల మీదగా లబ్ధిదారులకు ఇండ్ల తాళాలు అందజేశారు అయితే లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందజేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు కావస్తున్న లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేయకపోవడం ఎక్కడ ఉన్న ప్రజలు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు గత నెలలో సర్పంచి ఎలక్షన్ నోటిఫికేషన్ కి ముందు అక్కడ ఉన్న ప్రజలకు డబల్ బెడ్ రూమ్ అర్షత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హామీ ఇచ్చారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముగిసి రెండు నెలలు గడిచిన మా నిరుపేదల గురించి పట్టించుకోవడం లేదు అని బుధవారం పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందర కూర్చొని డబుల్ బెడ్ రూమ్ గురించి ఇచ్చిన పత్రాలను చూపిస్తూ వారి గోడును విలపించుకున్నారూ మరి ఈ వార్తకు సంబంధించి అధికారులు స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది
Tags
