ట్రాఫిక్ పోలీసుల కు హైకోర్టు కీలక ఆదేశాలు

ట్రాఫిక్ పోలీసుల కు హైకోర్టు కీలక ఆదేశాలు

TBN LIVE
పెండింగ్ చలాన్లు కట్టుమని బలవంతపెట్టొద్దు హైదరాబాద్: ట్రాఫికోపోలీసులను హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్లు కట్టుమని వాహనదారులను బలవంత పెట్టొద్దని సూచించింది. చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటివి చేయొద్దని తెలిపింది. వాహనం ఆపిన ప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే వసూలు చేసుకోవచ్చని, చెల్లించకపోతే చట్టప్రకారం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదా రులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!