మిడ్జిల్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

మిడ్జిల్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TBN LIVE
జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న మిడ్జిల్ మండలంలో ని ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ ను సస్పెండ్ చేస్తూ మంగళవారం మహబూబ్ నగర్ జడ్పీసీఈవో వెంకట్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. గత నెలలో మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ శ్రవణ్ రిమాండ్ అయ్యాడు. దీంతో రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా శ్రావణ్ ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు జడ్పిసిఈఓ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సస్పెండ్ ఉత్తర్వులను మిడ్జిల్ ఎంపీడీవో కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపినట్లు ఆయన వెల్లడించారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!