నవంబర్ 1 నుంచి 30 వరకు పోలీస్ ఆక్ట్ 1861అమలు జిల్లా ఎస్పీ జానకి

నవంబర్ 1 నుంచి 30 వరకు పోలీస్ ఆక్ట్ 1861అమలు జిల్లా ఎస్పీ జానకి

TBN LIVE
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెల మొత్తం 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ తెలిపారు.శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నవంబర్ 1వ తేది నుండి 30వ తేది వరకు మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 30 రోజులు పోలీస్ యాక్ట్ - 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్  ఒక ప్రకటనలో తెలిపారు.
కావున మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా లేదా ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకూడదని హెచ్చరించారు.జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు పోలీసు విభాగానికి సహకరించవలసిందిగా ఎస్పీ జానకి విజ్ఞప్తి చేశారు.అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!